Home  »  TV News  »  Karthika Deepam2:  శ్రీధర్‌కు హార్ట్ స్ట్రోక్.. సీఈఓ పదవి కోసం జ్యోత్స్న పంతం!

Updated : May 6, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -662 లో... శ్రీధర్ ని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. తనకి ఇంకొకసారి హార్ట్ స్ట్రోక్ వస్తే బ్రతకరు అని డాక్టర్ చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత శ్రీధర్ దగ్గరికి వెళ్లి కాంచన వాళ్ళు మాట్లాడుతారు. శ్రీధర్ కి రెస్టారెంట్ నుండి ఫోన్ లు వస్తాయి. మీకు ఇక రెస్ట్ కావాలి సీఈఓ పోస్ట్ కి రాజీనామా చెయ్యండి అని కాంచన చెప్తుంది. ఆయనకి రెస్టారెంట్ టెన్షన్స్ ఉన్నాయి కార్తీక్.. కొంచెం ఆలోచించండి.. మీ నాన్న గురించి చివరికి స్వప్న విషయంలో కూడా టెన్షన్స్ అని కాంచన అంటుంది.

కాశీ మీరిద్దరు మాట్లాడుకొని ఆయనకు టెన్షన్స్ లేకుండా చెయ్యండి అని కాంచన అంటుంది. స్వప్నని తీసుకొని కాశీ ఇంటికి వెళ్తాడు. మరొకవైపు కార్తీక్, కాంచన, శ్రీధర్ ముగ్గురు శివన్నారాయణ ఇంటికి వెళ్తారు. శ్రీధర్ నీరసంగా కన్పించడంతో అల్లుడికి ఏమైందని పారిజాతం అడుగుతుంది. హార్ట్ స్ట్రోక్ వచ్చిందని కార్తీక్ అనగానే అందరు షాక్ అవుతారు. ఆ విషయం మాకు చెప్పలేదని శివన్నారాయణ అడుగుతాడు. పాపం నిన్న దీప చెప్పబోతుంటే జ్యోత్స్న అడ్డుపడిందని పారిజాతం అనగానే జ్యోత్స్నపై శివన్నారాయణ కోప్పడతాడు. ఆ తర్వాత నాన్న ఆయనకి టెన్షన్ వద్దు సీఈఓగా వద్దు అలాగే నా కొడుకు కూడా రాడు అని కాంచన చెప్తుంది. అల్లుడిని వద్దని చెప్తున్నా కానీ కార్తీక్ ది నా చేతిలో లేదు.. వాడు ఒప్పుకుంటే వాడు రాకుండా ఉండేలా చేస్తాను కానీ వాడు ఒప్పుకోడని శివన్నారాయణ అంటాడు. నా పెళ్లి జరిగే వరకు ఈ అగ్రిమెంట్ క్యాన్సిల్ అవ్వదని జ్యోత్స్న చెప్తుంది.

మరొకవైపు మీ నాన్న కోసమైనా మనం కలిసిపోదామని స్వప్నతో కాశీ అనగానే పెళ్లికి ముందు అమ్మ లేదు అన్న సింపథీ.. పెళ్ళయాక డబ్బు లేదని.. ఇప్పుడు మా నాన్నని అడ్డు పెట్టుకున్నావా అని కాశీపై స్వప్న కోప్పడుతుంది.ఆ తర్వాత ఇప్పుడు మావయ్య స్థానంలో ఎవరు సీఈఓగా ఉంటారని జ్యోత్స్న అంటుంది. ఆ విషయం గురించి నువ్వు ఆలోచించకు.. మావయ్య గారు చూసుకుంటారని సుమిత్ర అంటుంది. దాంతో కార్తీక్ తన పేరెంట్స్ ని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.